అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ విడుదలకు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.