A new AI capability that delivers analysis-ready Media Intelligence. More than just a product launch, this is a shift in how communications teams monitor, understand and act on media coverage.
San Diego: The Department of Health–Abu Dhabi (DoH) and Biocom California, one of the world's largest life sciences associations representing more than 1,800 biotechnology, pharmaceutical and medical technology organisations, have announced a strategic partnership that will create a formal gateway between Abu Dhabi and California's life sciences ecosystems.
సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!! కువైట్: సమ్మర్ తలెత్తే అగ్నిప్రమాదాలపై కువైట్ ఫైర్ ఫోర్స్ హెచ్చరించింది. అధిక విద్యుత్ వినియోగం, వైరింగ్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం, విద్యుత్ ఉపకరణాలను ఎక్కువసేపు రన్నింగ్ లో పెట్టి వదిలివేయడం వంటివి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతాయని హెచ్చరించింది. వేసవి కాలంలో భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కువైట్ అగ్నిమాపక దళం పౌరులను, నివాసితులను కోరింది.
తెలంగాణకు వర్షాల అలర్ట్.. హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుండటంతో పాటు నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు దంచికొట్టనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!! రియాద్: లైసెన్స్ లేని క్యారియర్ల ద్వారా తమ ఉత్పత్తులను రవాణా చేసే డెలివరీ యాప్‌లపై జరిమానా విధిస్తామని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) హెచ్చరించింది. మాన్యువల్ డిస్పాచింగ్ పద్ధతులు లేదా లైసెన్స్ లేని వాహనాల ద్వారా తమ ఉత్పత్తులపై ఆధారపడే రెస్టారెంట్లు మరియు ఆన్లైన్ రిటైలర్లు ఉపయోగించే డెలివరీ అప్లికేషన్లపై చర్యలు తీసుకుంటామని TGA తెలిపింది.
Dubai: Arabian Travel Market (ATM) 2026 has reinforced Dubai’s position as one of the world’s most resilient and best-prepared destinations for global travel and tourism, as the industry continues to navigate the evolving market conditions.
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రకారం.. యూఏఈలో వేసవి తీవ్రత పెరుగుతుంది. రాబోయే కొన్ని నెలల పాటు ప్రజలు తీవ్రమైన వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు తూర్పు మరియు పర్వత ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నపు తీవ్రమైన వేడిని తప్పించుకోవడానికి చాలా మంది ప్రజలు ఇప్పటికే తమ దినచర్యలను మార్చుకుంటున్నారు. మరోవైపు, ఈ వేసవిలో అత్యంత వేడిగా ఉండే రోజులు ఇంకా ముందున్నాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. NCMలోని జనరల్ మెటియోరాలజీ విభాగం తాత్కాలిక అధిపతి ఈసా అల్ సెరీడి మాట్లాడుతూ..
NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ రియాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఓటర్లలో అవగాహన లోపం ఉందని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐల ఓటు హక్కులు దెబ్బతినకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకెళ్లింది.
రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!! దోహా: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రాస్ లఫాన్‌లోని ఒక పారిశ్రామిక కేంద్రంలో జరిగిన పేలుడులో పలువురు భారతీయ పౌరులు మరణించడం మరియు గాయపడటం పట్ల అమీర్ భారత ప్రధానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!! మనామా: ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) తన 70వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఫోటోగ్రాఫర్లు తమ కెమెరా ద్వారా బహ్రెయిన్ సౌందర్యాన్ని, సంస్కృతిని చక్కగా ఆవిష్కరించారు. ఈ పోటీలో150 మంది మహిళా ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. బహ్రెయిన్ పై తమ ప్రత్యేక దృక్కోణాలను తెలియజేసేలా 200కు పైగా ఫోటోలను సమర్పించారు. ILA క్లబ్‌హౌస్‌లో జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో విజేతలను ప్రకటించారు.
దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!! మస్కట్: దోఫార్ గవర్నరేట్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేర ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ నేరాలను అరికట్టడానికి మరియు ఆన్లైన్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. ముఠా కార్యాకలాపాలపై విచారణ కొనసాగుతుందని ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచించారు.