Vijayawada Mayor : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం మొదలుపెట్టింది. దీంతో అధికార కూటమిలో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ మేయర్ అభ్యర్థులు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో విజయవాడలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తన కుమారుడు సిద్ధార్థ తో కలిసి సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by Dharma Raj
AP Government : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..
AP Government : ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లిపాయల నుంచి నిత్యవసరాలు ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో నిత్యవసరాల ధరల నియంత్రణకు ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెనాయుడులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరలను నియంత్రించాలన్న నిర్ణయానికి వచ్చారు.
ap politics : పులిహోర.. ఆసుపత్రిలో వృద్ధులు!
Roja Selvamani : కొందరు ఏం చేసినా వికటిస్తుంది. కొందరిపై కొన్ని రకాల ముద్ర చాటుకుంటూ వస్తుంది. మొన్నటికి మొన్న నేపాల్ లో విపత్తు రావడం వెనుక మాజీ మంత్రి రోజా ఉన్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరిగాయి. ఇటీవల వరదలకు నేపాల్ పూర్తిగా నేలమట్టం అయినంత పని అయింది. అయితే కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి రోజా నేపాల్ వెళ్లిన ఫోటోలను జతచేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం నడిచింది. తాజాగా నగిరి లో జరిగిన ఓ కార్యక్రమంలో రోజా చేతులమీదుగా పులిహోర ప్యాకెట్ అందుకొని..
Jagan vs Chandrababu: జగన్ ఆలోచన అలా.. చంద్రబాబుది ఇలా!
Jagan vs Chandrababu: ఏ రాజకీయ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వం అయినా ఆలోచించేది ప్రజల మంచికే. ప్రజలకు సుపరిపాలన అందించాలన్నది పార్టీలు, ప్రభుత్వాల లక్ష్యం. అయితే మనం వెళ్లే విధానంలో తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులతో మూడు ప్రాంతాల ప్రజల అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. చంద్రబాబు మాత్రం మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సమాజంలో ఎక్కువగా ఉండే రైతుల్లో సంతృప్తి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజల తిరస్కరణ..
Chandrababu Naidu: ప్రాజెక్టులు కట్టారట.. వైఫల్యం చంద్రబాబుదట!
Chandrababu Naidu: ఏ ముహూర్తాన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రెడిట్ చోరీ అనే పదాన్ని వాడారు. కానీ ఆ పదాన్ని విపరీతంగా చోరీ చేసి క్రెడిట్ కొట్టేస్తున్నారు దేశవ్యాప్తంగా కొంతమంది నేతలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసిపి నేతల నోటి నుంచి ఎక్కువగా క్రెడిట్ చోరీ అనే మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏ ప్రారంభోత్సవం చేసినా అది మా క్రెడిట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఒక్క అమరావతి విషయంలో తప్ప మిగతా ఏ ప్రారంభోత్సవం చేసినా అదేపనిగా ప్రకటనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఒకవైపు క్రెడిట్ చోరీ చేస్తున్నారు.
Srikakulam politics: చేతులు కలిపిన ఆ ఇద్దరు.. ఆ జిల్లాలో నయా రాజకీయం!
Srikakulam politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల పరిస్థితి మరీ వింతగా ఉంది. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ప్రాధాన్యత లేకుండా పోయారు. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమదాలవలస నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తమ్మినేని సీతారాంకు ఇంచార్జ్ పదవి లేదు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ పై కుటుంబ, వ్యక్తిగత వివాదాలతో సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఆ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు.
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు వేలం!
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన విలువైన ఆస్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగ వేలం వేయడం ద్వారా వాటిని విక్రయించాలని చూస్తోంది. ప్లాంట్ కు సంబంధించి 93,572 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 459 ప్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అసెట్ మానిటేషన్ ప్రక్రియ ద్వారా.. ఈ ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు చేస్తోంది. నిధుల సమీకరణ లక్ష్యంగా స్థలాల విక్రయాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.
AP Local elections: స్థానిక ఎన్నికలు.. వైసిపి ఇన్చార్జిల బాధ అంతా కాదు!
AP Local elections: ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆ నియోజకవర్గ ఇన్చార్జి టికెట్ ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పారు. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు కచ్చితంగా ఉండాలని.. లేకుంటే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూకుడుగా పని చేశాయి. బలవంతంగా ఏకగ్రీవాలు చేశాయి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తాము ఎంతలా ఏకగ్రీవాలు చేశామో అన్నది వైసీపీ నేతలకు తెలుసు.
AP Alliance Govt: హింద్రీనీవా, వెలుగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ.. కూటమికి ఇదే సానుకూలత!
AP Alliance Govt: కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. వరుసగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేస్తోంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వరుస ప్రారంభోత్సవాలు చేయడం రాష్ట్రంలో సానుకూలత కనిపిస్తోంది. ముందుగా రాయలసీమలో హింద్రీనీవా, మొన్ననే పశ్చిమ ప్రకాశంలో వెలుగొండ, తాజాగా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. ఇలా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు చేస్తుండడం ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. ఈ సంతృప్తిని తమకు కూడా పంచాలన్న ఆలోచన వైసిపి లో ఉంది. ఒకవైపు మా కృషి అంటూనే..
YSR Congress Party : సజ్జలకు ఊస్టింగ్.. ఇక అంతా ఆ సీనియర్!
YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం. ఇప్పటివరకు జగన్ చుట్టూ ఆ నలుగురు అనే పరిస్థితి ఉండేది. అయితే పార్టీని విభేదించి విజయసాయి రెడ్డి లాంటి వారు బయటకు వెళ్లిపోవడంతో కోటరీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని ఇతర సీనియర్లు సహించుకోలేకపోతున్నారు. ఇది స్పష్టం అవుతుండడంతో జగన్ సైతం పునరాలోచనలో పడ్డారు. సజ్జల విషయంలో వైసీపీలోనే ఒక రకమైన ప్రచారం బలంగా వెళ్తోంది. దీనిని అర్జెంటుగా కట్టడి చేయాలి.
TDP : బిజెపి- శివసేన.. ఇప్పుడు టిడిపి-జనసేన.. రెండేళ్లలో మార్పు!
TDP : రాజకీయ పార్టీల మధ్య స్నేహం అనేది చాలా కీలకం. మిత్రపక్షాలు అంటేనే ఉభయ పార్టీలు కలిసి పోవాలి. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపి విషయాన్ని పక్కన పెడితే.. టిడిపి, జనసేనల మధ్య బంధం పెరిగింది. ఒకప్పుడు ఆ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురించిందే కానీ.. ఒక రకమైన గ్యాప్ ఉండేది. కానీ దానిని తగ్గించగలిగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నిన్ననే పవన్ జన్మదినోత్సవం నాడు అది స్పష్టంగా కనిపించింది.
Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే!
Vijaya Sai Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల గట్టి ఆరోపణలు చేశారు. తనపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆరోపించారు. వైసీపీలో జరిగిన అవమానాలతోనే తాను బయటకు వచ్చానని వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనపై భౌతిక దాడి కూడా చేశారని.. అది కూడా జగన్ సమక్షంలోనే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మకద్రోహి అని ప్రచారం చేస్తున్నారని.. తాను నమ్మకద్రోహి అయి ఉంటే నాడే అప్రూవర్ గా మారేవాడినని చెప్పుకొచ్చారు.
Godavari Water : మొన్న కృష్ణమ్మ.. నేడు గోదావరి.. చంద్రబాబు జన్మధన్యం!
Godavari Water : ఏపీలో మరో సుందర దృశ్యం ఆవిష్కృతం అయింది. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో గోదారమ్మ పరుగులు తీస్తోంది. పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్ద గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వడంతో.. ఉరకలేస్తున్న ఉత్సాహంతో గోదావరి జలాలు ఉత్తరాంధ్రను తాకాయి. దీంతో ఉత్తరాంద్రుల చిరకాల వాంఛ నెరవేరింది. సీఎం చంద్రబాబు బుధవారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు.. పాయకరావుపేట నియోజకవర్గం లో ఈ గోదావరి జలాల ఉత్తరాంధ్ర ప్రవేశానికి శ్రీకారం చుట్టారు.
Janasena Party: జనసేన యూత్ లక్ష్యంగా ‘జై కొట్టు’!
Janasena Party: ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ పుట్టినరోజు సందర్భంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం పేరును ‘జై కొట్టు’ గా నామకరణం చేసింది. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నూతన విభాగం ‘జై కొట్టు’ను ఆవిష్కరించారు. జై కొట్టు పేరుతో ప్రత్యేకంగా ఒక పాటను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ పాట షేక్ చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకాయి.
TTD Deputy EO: టీటీడీ డిప్యూటీ ఈవో..రూ.100 కోట్ల ఆస్తులు!
TTD Deputy EO: ఏపీలో సైతం అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఇప్పటివరకు తెలంగాణ ఏసీబీ మాత్రమే భారీ అవినీతి అధికారులను పట్టుకుంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ ఏసీబీ పెద్ద స్థాయిలో అవినీతి అధికారులను పట్టుకోవడం తక్కువ. కానీ తాజాగా ఓ 100 కోట్ల రూపాయల అవినీతి అధికారిని ఏపీ ఏసీబీ పట్టుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈసారి ఏకంగా టీటీడీ ఎలక అధికారి ఏసీబీకి పట్టు పడడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం భారీ అక్రమ ఆర్జనకు సంబంధించి ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు.
APSRTC: ఏసీ బస్సుల్లో సైతం మహిళలకు ఉచిత ప్రయాణం!
APSRTC: ఏపీలో మహిళల ఆర్టీసీ ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఎప్పటి వరకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఇప్పుడు మరికొన్ని బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఏడాది కిందట ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఇప్పటివరకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ వచ్చారు.
AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లు.. దరఖాస్తులు ఇలా!
AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వితంతువుల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన వితంతువులకు ఇంతవరకు పింఛన్లు కొత్తగా ఇవ్వలేదు. కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం వారికి ఇవ్వాలని నిర్ణయించడం శుభపరిణామం. వాస్తవానికి వృద్ధాప్యంతో పాటు వితంతువులకు పింఛన్ అందించాలని ప్రభుత్వం భావించింది. ముందుగా వితంతువులకు ఇచ్చి తర్వాత వృద్ధులకు అవకాశం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.
YS Rajasekhara Reddy: ‘వైఎస్ఆర్’ను మరిచిపోయిన వైసీపీ!
YS Rajasekhara Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో.. విపరీతమైన సెంటిమెంట్ పునాదులతో నిర్మించిన పార్టీ అది. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడుగా మాత్రమే ఈ రాష్ట్రానికి సుపరిచితం అయ్యేవారు. ఆయనకంటూ ఏం ప్రత్యేకత ఉండేది కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి తన మరణాన్ని కుమారుడుకు అధికార వరంగా మార్చేశారు. ఆయన మరణంతో ఏర్పడిన సానుభూతితో ఉద్భవించినదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి చనిపోయి వైసిపికి ఉపయోగపడ్డారు.
Lokesh And Pawan Kalyan: పవన్ పై లోకేష్.. వైసీపీకి అస్త్రం!
Lokesh And Pawan Kalyan: ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. మూడు పార్టీల కూటమి ఒక వైపు.. మరోవైపు విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ మూడు పార్టీల మధ్య బంధం స్ట్రాంగ్ గా ఉంది. అలా ఉన్నంతవరకు ఆ కూటమిని వైసిపి ఏం చేయలేదు అనేది మెజారిటీ విశ్లేషకుల భావన. అయితే ఐక్యం అనేది ఆ మూడు పార్టీల ఇష్టం. వైసిపి గెలవాలి అనుకున్నవారు కూటమి విచ్ఛిన్నం కావాలని కోరుకుంటారు. మెజారిటీ వైసీపీ శ్రేణులు కోరుకునేది అదే. అందుకే ఆ మూడు పార్టీల మధ్య విఘాతానికి చేయని ప్రయత్నం అంటూ లేదు.
Chandrababu Water Message: జలం జీవం జీవితం.. చంద్రబాబు చెప్పిన గొప్ప నీటి సందేశం..
Chandrababu Water Message: ఈ భూమి మీద పీల్చేగాలి తర్వాత అత్యంత ముఖ్యమైనది నీరు. ఈ భూభాగంలో సింహభాగం నీరు ఉన్నప్పటికీ.. అందులో తాగడానికి పనికి వచ్చేది కొంత మాత్రమే. అందువల్లే తాగునీటిని జాగ్రత్తగా వాడాలి. తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా రక్షించుకోవాలి. నీరు లేకపోతే ఈ భూమ్మీద జీవికి మనుగడలేదు. అందువల్లే నీటి వనరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిని వినియోగించుకునే విషయంలో కూడా ముందుచూపును ప్రదర్శించాలి. నీటి వనరులను ఇష్టానుసారంగా వాడితే..
Polavaram Left Main Canal: రేపే ఉత్తరాంధ్రకు గోదావరి!
Polavaram Left Main Canal: ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. కీలక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు సీమకు కృష్ణమ్మ నీటిని తరలించింది. ఇప్పుడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించే శుభముహూర్తానికి రంగం సిద్ధం అయ్యింది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూముల్లోకి పారేందుకు సమయం ఆసన్నమైంది. రేపు సీఎం చంద్రబాబు రెగ్యులేటర్ ఆన్ చేసి.. గోదావరి జలాలకు జల హారతి ఇవ్వనున్నారు.
Kotamreddy Sridhar Reddy: విజయసాయిరెడ్డిని సజ్జల కొట్టారు.. ఇదిగో సాక్ష్యం!
Kotamreddy Sridhar Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు జరిగాయని మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొన్న మధ్యన 2 పేజీల లేఖ రాసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. తనకు వైసీపీలో 73 సార్లు అవమానం జరిగిందంటూ లెక్క కట్టి మరీ చెప్పారు. అంతటితో ఆగకుండా తనపై సజ్జల రామకృష్ణారెడ్డి భౌతిక దాడికి ప్రయత్నించారు అని కూడా ఆరోపించారు. పార్టీ ప్లీనరీలో ఎవరు మాట్లాడుతారు అనే జాబితా తయారు చేసే క్రమంలో తనపై దూకుడుగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అయితే సజ్జల తనను కొట్టారని..
YV Subba Reddy: వైవి సుబ్బారెడ్డి పై వైసీపీలో ఆగ్రహం!
YV Subba Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక నేత వైవి సుబ్బారెడ్డి పై విస్తృత చర్చ నడుస్తోంది. ఆయన అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మూర్ఖుడు అంటూ సంబోధించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఒంగోలు వైసీపీ నేతలు. కానీ అదే జిల్లాకు చెందిన వై వి సుబ్బారెడ్డి నోరు తెరవకపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై తీవ్రంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Annadata Sukhibhava: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..’అన్నదాత సుఖీభవ’ పై అప్డేట్!
Annadata Sukhibhava: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ మలివిడత నిధుల చెల్లింపులపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడత నిధులు జూన్ నెలలో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వినాయక చవితి పండగకు ముందే మలి విడత నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు. కానీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు సంబంధించిన సంసిద్ధత రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
Veligonda Project: కూటమికి ‘వెలిగొండ’ క్రెడిట్ రాకుండా వైసిపి గట్టి ప్రయత్నాలు!
Veligonda Project: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అంటారు. ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో అదే మాదిరిగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అక్కడ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం తో పాటు పరిహారం చెల్లించింది కూటమి ప్రభుత్వం. న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని రకాల పరిహారాలు వారికి దక్కాయి. నిర్వాసితులు గ్రామాలను విడిచిపెట్టి పునరావాస గ్రామాలకు వెళ్తున్నారు. దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తుండగా.. మరోవైపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అవమానం జరిగిందంటూ వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది.
Amaravati Signature Bridge: అమరావతిలో మరో కీలక ప్రాజెక్ట్.. ఏకంగా రూ.1000 కోట్లతో..!
Amaravati Signature Bridge: అమరావతి విషయంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అమరావతికి, విజయవాడకు మధ్య రవాణాకు సంబంధించి ఒక కీలక ప్రాజెక్టు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసే పనిలో పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో రూ. 1000 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిష్టాత్మకంగా సిగ్నేచర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు డిపిఆర్ తయారీకి ప్రభుత్వం ప్రాథమికంగా అడుగులు వేస్తోంది.
YSRCP: కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రచారం!
YSRCP: ఏపీలో దూకుడు పెంచింది కూటమి ప్రభుత్వం. వరుసగా అభివృద్ధి పనులను చేపడుతూ వస్తోంది. అయితే ఇటీవల వరుసగా నూతన ప్రారంభోత్సవాలు చేస్తోంది. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం.. ఎమ్మెల్యేల క్వార్టర్లు అందుబాటులోకి తేవడం, తాజాగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడం, మరోవైపు ఉత్తరాంధ్రాకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియకు సంబంధించి ప్రారంభోత్సవం.. ఇలా వరుసగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
Visakhapatnam Municipal Election: విశాఖ మేయర్.. ఆ ముగ్గురు మధ్య పోటీ!
Visakhapatnam Municipal Election: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రంగం సిద్ధం అవుతోంది. అక్టోబర్లో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు అధికార కూటమిలో ఇప్పటినుంచి పదవుల కోసం నేతలు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ప్రధానంగా విశాఖ మేయర్ పై పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్నం.
Rayalaseema Politics: రాయలసీమలో వైసీపీకి సేమ్ సీన్..!
Rayalaseema Politics: గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. ఆ పార్టీకి దారుణ ఓటమి ఎదురైంది. అయితే బలమైన ప్రాంతంగా ఉన్న రాయలసీమలో కూడా ఆ పార్టీకి దెబ్బ తగిలింది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం పనిచేయకపోవడం, సైలెంట్ గా ఉండిపోవడంతో వైసీపీకి నష్టం కలిగింది. అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గం యూటర్న్ అవుతుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు గట్టిగానే కృషి చేస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ అటువంటిదేమీ లేదని..
Botsa Satyanarayana: బొత్సకు సొంత వారితో చెక్ పెడుతున్న జగన్!
Botsa Satyanarayana: ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దానిని ఆయన నేరుగా ఖండించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. జనసేనలో చేరేది లేదని కరాకండిగా చెప్పడం లేదు. దీంతో పార్టీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. మరోవైపు బొత్సకు ప్రత్యామ్నాయంగా జగన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స వెళ్ళిపోతే జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు గట్టి వ్యూహం అమలు చేస్తున్నట్లు సమాచారం.
Jana Sena Party: జనసేనలో భారీ చేరికలు!
Jana Sena Party: తెలంగాణలో జనసేన బలోపేతం పై నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కార్యకలాపాలు మొదలు పెట్టింది. అందుకు గాను హైదరాబాదులో కేంద్ర కార్యాలయాన్ని కూడా తెరిచారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ముందుగా గ్రేటర్లో సత్తా చాటి.. మిగతా రాష్ట్రమంతా విస్తరించాలన్నది జనసేన ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగా భారీ ఎత్తున చేరికలు జరగాలని భావిస్తోంది.
Veligonda Project: ‘వెలిగొండ’తో కొండంత ఆనందం.. బాబును ఇంత ఆనందంగా ఎప్పుడూ చూసి ఉండరు
Veligonda Project: కరువు నేలపై కృష్ణమ్మను పరవళ్ళు తొక్కింది. పశ్చిమ ప్రకాశం జిల్లాకు కృష్ణా నది నీరు వెళ్ళింది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అశేష జనవాహిని నడుమ కృష్ణమ్మకు జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు. తీవ్ర భావోద్వేగంతో సాష్టాంగ నమస్కారం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రారంభోత్సవ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. రైతులతో పాటు మహిళా రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆనందంతో మహిళా రైతులు నృత్యాలు చేశారు. వారిని చూసి చంద్రబాబు సైతం ఎంతో ఆనందించారు.
Punganur TDP: పుంగనూరులో టిడిపి కొత్త ప్రయోగం!
Punganur TDP: పుంగనూరు నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ హై కమాండ్. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తోంది. వైసిపి మాదిరిగా వై నాట్ అనే పదం ప్రయోగించకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అందులో భాగంగా టిడిపి నియోజకవర్గ బాధ్యతల నుంచి చల్లా బాబును తప్పించింది. ఆయన స్థానంలో మధుసూదన్ నాయుడుకు బాధ్యతలు కట్టబెట్టింది. గత కొంతకాలంగా చల్లా బాబు అని పిలవబడే చల్లా రామచంద్రారెడ్డి గట్టిగానే కృషి చేశారు.
YV Subba Reddy: వైవి సుబ్బారెడ్డి సడన్ ఎంట్రీ.. ఏంటి కథ?!
YV Subba Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రాంతాలవారీగా సమన్వయకర్తలు ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 మంది వరకు ప్రాంతీయ సమన్వయకర్తలు ఉండగా.. ప్రధాన సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలకు సంబంధించి.. ఉత్తరాంధ్ర అత్యంత ప్రాధాన్యం అయినది. ఎందుకంటే ఇక్కడ విశాఖ అంతర్భాగం. వైసీపీ హయాంలో ఇక్కడ సమన్వయకర్తలుగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అటు తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యవహరించారు. విజయసాయి రెడ్డి సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఆయన కను సన్నల్లోనే ఉత్తరాంధ్ర వ్యవహారాలు నడిచేవి.
Botsa Satyanarayana: పార్టీ మారడంపై ఖండించని బొత్స
Botsa Satyanarayana: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా ఓ రాజకీయ పరిణామం కుదిపేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి.. అదే పార్టీని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పై టార్గెట్ చేసుకున్న ఆయన పార్టీ మారబోతున్నారు అంటూ బొత్సపై వ్యాఖ్యానించారు. త్వరలో జనసేనాలో బొత్స ఫ్యామిలీతో పాటు చేరుతారు అన్నది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం.
Veligonda Project: కృష్ణమ్మకు ప్రణమిల్లి.. చంద్రబాబు సాష్టాంగ నమస్కారం!
Veligonda Project: కరువు నేలలో సుందర దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారు సీఎం చంద్రబాబు. కృష్ణమ్మ జలాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. 1996లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత ప్రారంభోత్సవం చేశారు. జాతికి అంకితం చేసిన తర్వాత కృష్ణమ్మ పరవళ్లను చూసి మురిసిపోయారు. తీవ్ర భావోద్వేగానికి లోనై సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రస్తుతం వాటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. * సరిగ్గా మూడు దశాబ్దాల కిందట..
Balineni Srinivasa Reddy: బాలినేనికి జనసేనలో కష్టమేనా?!
Balineni Srinivasa Reddy: జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారా అన్న చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆయనను పక్కకు తప్పించారన్న చర్చ జోరుగా సాగుతోంది. మొన్న మధ్యన స్థానిక ఎన్నికల నిర్వహణ కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై 14 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ కమిటీలో బాలినేనికి చోటు లేదు.
KA Paul: నత్తో.. అంటూ బొత్సని ఇచ్చి పడేసిన కేఏ పాల్.. వైరల్!
KA Paul: కేఏ పాల్ మళ్లీ ముందుకు వచ్చారు. పొలిటికల్ సెటైరికల్ విమర్శలు ప్రారంభించారు. ఈసారి ఆయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసుకున్నారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో బొత్స మాట్లాడారు. మధ్యలో కేఏ పాల్ ప్రస్తావన తీసుకొస్తూ.. చాలా ఎగతాళిగా మాట్లాడారు. దానిని తట్టుకోలేకపోయారు కే ఏ పాల్. ఆయన మంత్రి ఎలా అయ్యారు అంటూ బొత్సపై విరుచుకుపడ్డారు. దేవుడు ఇప్పటికే ఆయనకు నత్తి ఇచ్చారని.. ఇప్పటికీ బుద్ధి రాలేదు అంటూ కామెంట్స్ చేశారు.
Vijay Sai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డిని అలా క్లోజ్ చేశారా?!
Vijay Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల విరుచుకుపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి పై. అడుగడుగునా అవమానాలు తట్టుకోలేక తాను వైసీపీ నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే దీనికి ముమ్మాటికీ ఆ కోటరీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మాజీ మంత్రితో కుట్ర చేసి తనను సమన్వయకర్త పదవి నుంచి తొలగించారని చెప్పారు. సదరు ఆ మాజీ మంత్రి ప్రస్తుతం పార్టీ మారే ప్రయత్నంలో ఉన్నారంటూ కొచ్చారు.
Veligonda Project: కరువు నేల వికసించేలా.. 30 ఏళ్ల కల.. వెలిగొండ సాకారం వేళ.. దీని చరిత్ర తెలుసా?*
Veligonda Project: దశాబ్దాల కల ఆవిష్కృతం అయ్యింది. కరువు నేలపై జలసిరులు పొంగిపొర్లే సమయం వచ్చేసింది.. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని గంటవాని పల్లె సమీపంలో ప్రాజెక్టును ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు.
YS Jagan: జగన్ ఊహిస్తున్నట్టు తీవ్ర వ్యతిరేకత ఉందా?!
YS Jagan: వచ్చే ఎన్నికల్లో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి కూటమిని ఎదుర్కోవడం పెద్ద సాహసం. అంతకుమించి సొంత వారిపై జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాటం చేయాల్సి ఉంటుంది.. ఇప్పటివరకు తన సొంత వారిగా భావిస్తున్న సునీత, షర్మిల తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో విజయసాయిరెడ్డి చేరారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థుల సంఖ్య పెరుగుతుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారం అనేది జగన్మోహన్ రెడ్డికి అంత సులువు కాదు. గట్టిగానే పోరాటం చేస్తే తప్ప దొరకదు.
AP Government: కూటమి బ్రహ్మాస్త్రం అదే!
AP Government: మాటలాడే పద్ధతి బట్టి.. మన మాటలకు విలువ ఉంటుంది. ఎవరితో చెప్పిస్తే ప్రజలలోకి వెళ్తుందో.. వారితోనే చెప్పించాలి. ఇక రాజకీయ ప్రచారం అంటారా దానికంటూ ఒక వ్యూహం ఉంటుంది. 2024లో జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధాన కారణం టిడిపి వ్యూహాత్మక ప్రచారం. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా 2024 ఎన్నికలకు ఏడాది ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి స్పష్టంగా కనిపించింది. 2019లో 23 సీట్లతో సరిపెట్టుకున్న చంద్రబాబు.. అనుసరించిన పద్ధతి, ప్రజల్లోకి వెళ్లిన తీరు ప్రత్యేకమే.
YS Jagan: జగన్ మళ్లీ రాలేడా? ఏపీలో ఊహించని ప్రచారం
YS Jagan: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. మరో రెండున్నర ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. అయితే ఎప్పటి నుంచే ఎన్నికల వాతావరణం నెలకొంది ఏపీలో. రేపే ఎన్నికలు అన్నట్టు సర్వేలు హల్చల్ చేస్తుండగా.. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఓ పాయింట్ కీలకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. అలాగని వారు జగన్ కు పూర్తి వ్యతిరేకం. జగన్ ఇక రారు.. రాకూడదు అనేది వారి అభిప్రాయం. ప్రభుత్వ వైఫల్యాలను తటస్థం రూపంలో ప్రస్తావిస్తుంటారు వారు.
Ambati Rambabu Health: అంబటి రాంబాబుకు జగన్ పరామర్శ!
Ambati Rambabu Health: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హైదరాబాదులో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆయన గుండెకు రెండు స్టంట్ లు కూడా వేశారు. సాధారణ ఆరోగ్య తనిఖీలకు వెళ్లిన అంబటి రాంబాబుకు స్టంట్సు అవసరమని గుర్తించి వెంటనే ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే ఈ విషయం బయటకు రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అంబటి ఆరోగ్యం పై చర్చ నడిచింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Vijayasai Reddy: నిన్న షర్మిల.. రేపు సాయిరెడ్డి.. కొత్త శత్రువు
Vijayasai Reddy: ఏదైనా ప్రచారాన్ని సొంత వారు చెబితే ఎవరైనా నమ్ముతారు. ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి చెప్పిన తర్వాతే చాలా విషయాలపై క్లారిటీ వచ్చింది. అంతెందుకు వివేకానంద రెడ్డి హత్య అంశానికి సంబంధించి ఆయన కుమార్తె సునీత పోరాటం ప్రారంభించాక అసలు విషయం తెలిసింది. సొంత మనుషులే వివేకానంద రెడ్డి హత్య చేశారని.. దానిని రాజకీయంగా వాడుకున్నారని స్పష్టమైంది. మరోవైపు తన అన్న వ్యక్తిత్వాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పింది కూడా షర్మిల. అయితే ఇప్పుడు షర్మిల రూట్లోకి విజయసాయిరెడ్డి వచ్చారు.
AP Housing Scheme: సొంత ఇళ్లు లేనివారికి ఇది గొప్ప శుభవార్త.. వెంటనే త్వరపడండి
AP Housing Scheme: ఏపీ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులందరికీ ఇళ్లు అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రానికి నాలుగు లక్షల ఇళ్ళు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వారం,పది రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద భారీగా ఇళ్ల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో..
Sajjala Botsa Controversy: వైసీపీలో ‘సజ్జల-బొత్స’ కల్లోలం!
Sajjala Botsa Controversy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బాంబు వేశారు విజయసాయిరెడ్డి. తనను నమ్మకద్రోహి అంటూ విమర్శించడానికి తట్టుకోలేక 2 పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఆయనకంటే ఇంకా నమ్మకద్రోహి ఎవరు ఉంటారు అంటూ.. పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాలను ఏకరువు పెడుతూ తన ఆవేదనను బయటపెట్టారు. అయితే మధ్యలో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి అంటూ పరోక్షంగా బొత్స సత్యనారాయణ ప్రస్తావన తీసుకొచ్చారు.
Vijayasai Reddy: సజ్జలను కడిగిపారేసిన విజయసాయిరెడ్డి!
Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు అంతా ఓపెన్ అయ్యారు. తాను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాను అనేదానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసం కేసులు పడి.. ఎన్నెన్నో అవమానాలు పడి.. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. తన గౌరవాన్ని పెంచాల్సింది పోయి.. తగ్గించేసారని. తన స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చారన్న బాధ ఆయనలో ఉంది. ఇన్నాళ్లు కోటరీ అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఆ కోటరి నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న విషయాన్ని బయట పెట్టేశారు.
AP Local elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు బాటలో జగన్!
AP Local elections: వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అటువంటి చోట నియోజకవర్గ ఇన్చార్జి లకు టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పారు. కానీ ఈ ప్రకటన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. కచ్చితంగా ఈ ప్రకటనతో తెలుగుదేశం కూటమి ముందుగానే పావులు కదుపుతుంది. ముందుగా పులివెందుల నియోజకవర్గం పైనే ఫోకస్ పెడుతుంది. గత ఏడాది పులివెందుల జడ్పిటిసి స్థానం ఏ విధంగా పట్టుబట్టి గెలిచిందో.. కచ్చితంగా పులివెందుల మునిసిపాలిటీని సైతం అలాగే కైవసం చేసుకుంటుంది.
YSR Congress Party : వైసిపి నుంచి ‘కడప’ చేజారుతోందా?!
YSR Congress Party : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతం రాయలసీమ. అటువంటి ప్రాంతంలో మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కడప జిల్లాలో సైతం కూటమిదే ఆధిపత్యం. పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి గెలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే కడప పార్లమెంటు స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవడం ఆ పార్టీకి కొంత ఉపశమనం. కానీ ఈసారి కడప సీటు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోనుందని ఓ సంచలన సర్వే వెల్లడించింది.
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with Dharma
Contact Dharma, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack