Is this you? As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.
Claim your profile
Articles by NTV Telugu
Top Headlines@9PM: టాప్ న్యూస్
Published Date :February 15, 2024 , 9:00 pm *వాలంటీర్లే నా సైన్యం.. వారే కాబోయే లీడర్లు.. ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు.
Rashmika Mandanna : రష్మిక మందన్న కు అరుదైన గౌరవం..
Published Date :February 15, 2024 , 6:56 pm నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా రష్మిక మందన్న గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి..
Top Headlines@5PM: టాప్ న్యూస్
Published Date :February 15, 2024 , 5:00 pm *ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం సమాధానం బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు. బడ్జెట్‌ను సహేతుకంగా రూపొందించామని..
AP Crime: 16 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. అనుమానంతో హత్య..!
Published Date :February 15, 2024 , 2:19 pm AP Crime: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపు సావరంలో దూళ్ల సత్య శ్రీ (35) అనే వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. అనుమానంతో భార్యను భర్తే హత్య చేశాడు.. 16 ఏళ్లు క్రితం దూళ్ల సత్యశ్రీకి ఇదే గ్రామానికి చెందిన సూర్యప్రకాష్ (సూరిబాబు)తో ప్రేమ వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య గత మూడు నెలలుగా వివాదం ఏర్పడింది. ఇరువురు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. అప్పటి నుండి కొద్ది రోజులు ఇరువురు కాపురం సాఫీగానే సాగింది.
Pending Challans: ట్రాఫిక్ చలాన్ల రాయితీపై చెల్లింపు.. నేటితో ముగియనున్న గడువు
Published Date :February 15, 2024 , 12:09 pm Pending Challans: గత ఏడాది డిసెంబర్ 27న పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. చలాన్ల చెల్లింపునకు జనవరి 10 వరకు గడువు ఇవ్వగా.. ఆ తర్వాత గడువును జనవరి 31 వరకు పొడిగించింది. అనంతరం ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి 15వ తేదీవరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు. దీంతో సబ్సిడీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు గడువు ఇవాళ (గురువారం) అర్ధరాత్రితో ముగియనుంది. పెండింగ్‌లో ఉన్న వాహనాల చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Variety Fashion : ఏంటి ఇది.. నీ ఫ్యాషన్ తగలబడ.. ఎలుకల బోనులతో హీల్స్ ఏంటి తల్లి ?
Published Date :February 15, 2024 , 11:56 am Variety Fashion : ప్రస్తుతం ప్రపంచం ఫ్యాషన్‌పైనే ఆధారపడి ఉంది. రకరకాల బట్టలు, షూలు, చెప్పులు మొదలైనవాటిని ధరిస్తారు. మరికొంత మంది విచిత్రమైన బట్టలు కూడా ధరించి కనిపిస్తుంటారు. మీరు ఇలాంటి ఫ్యాషన్ షోలు ఎన్నో చూసి ఉంటారు. అందులో మోడల్స్ వింత దుస్తులతో క్యాట్‌వాక్‌పై నడుస్తూ ఉంటారు. చాలా సార్లు ఫ్యాషన్ కోసం వారు వింత హైహీల్స్ కూడా ధరిస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
PM Modi: ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ కీలకోపన్యాసం
Published Date :February 14, 2024 , 3:30 pm ప్రపంచానికి పచ్చని (Green), స్వచ్ఛమైన (Clean), సాంకేతిక పరిజ్ఞానం (Tech Savvy) ఉన్న ప్రభుత్వాలు అవసరమని ప్రధాని మోడీ (PM Modi) ఆకాంక్షించారు. యూఏఈలో (UAE) రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రెండోరోజు మోడీ పర్యటన కొనసాగుతోంది. దుబాయ్‌లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ ప్రసంగించారు. ప్రపంచానికి స్వచ్ఛమైన, ఆకుపచ్చ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రభుత్వాలు అవసరమని మోడీ నొక్కి చెప్పారు.
Pulwama Terror Attack: మరిచిపోలేని దుర్ధినం.. దేశం 40మంది వీరులను కోల్పోయిన క్షణం
Published Date :February 14, 2024 , 7:56 am Pulwama Terror Attack: సీఆర్పీఎఫ్ కాన్వాయ్ జమ్మూ నుండి బయటకు వచ్చింది. సైనికులు నవ్వుతూ, పాడుతూ ముందుకు సాగుతున్నారు. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు? గమ్యం కేవలం 30 కి.మీ దూరంలో ఉండగా.. కాన్వాయ్‌లోకి వేగంగా వచ్చిన ఈకో కారు బస్సును ఢీకొట్టింది. మరు క్షణంలోనే భారీ పేలుడు సంభవించింది. దీని ప్రతిధ్వని 10 కిలోమీటర్ల వరకు వినిపించింది. పొగతో ఆ ప్రాంతమంతా కారు చిమ్మట్లు కమ్ముకుంది. ఆ పొగలో కారు గానీ, కారు ఢీకొన్న బస్సు గానీ కనిపించలేదు.
Delhi: ఢిల్లీలో ఓ రైలులో మంటలు.. కారణమిదే!
Published Date :February 13, 2024 , 6:09 pm సెంట్రల్ ఢిల్లీలోని (Delhi) పటేల్ నగర్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. మంటలు అంటుకున్న సమయంలో రైలు బోగీలు అన్ని ఖాళీగా ఉన్నాయి. ట్రైన్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పటేల్ నగర్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ 3 మీద సిర్సా ఎక్స్‌ప్రెస్ ఆగి ఉంది. మధ్యాహ్నం 1.33 గంటలకు ఒక్కసారిగా రైల్లో మంటలు అంటుకున్నాయి (Train Empty Coach Fire).
Farmers Protest: “బలాన్ని ఉపయోగించడం..” రైతుల ఆందోళనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Published Date :February 13, 2024 , 5:31 pm Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి పలు డిమాండ్లు చేస్తూ రైతులు “ఢిల్లీ ఛలో” మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రైతుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్-హర్యానా హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారించింది.
MLC Kavitha : కారుణ్య నియామకాలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
Published Date :February 13, 2024 , 4:36 pm కారుణ్య నియామకం కింద తెలంగాణా వాసులకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన సందర్భంగా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, దాని ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టాలు కూడా చేసిందన్నారు.
Medigadda Barrage: మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు దూరంగా బీఆర్ఎస్- బీజేపీ
Published Date :February 13, 2024 , 11:50 am Telangana: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రులతో పాటు ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యెలు వెళ్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి బస్సులో సీఎం బృందం బయల్దేరింది. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గరకు ప్రజా ప్రతినిధుల బృందం చేరుకోనున్నారు. మేడిగడ్డ బ్రిడ్జ్, కుంగిన పిల్లర్లను ఈ బృందం పరిశీలించనుంది. సాయంత్రం 5 గంటలకు సీఈ సుధాకర్‌రెడ్డి, విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్..
Jack Update: 35 రోజుల్లో 65% పూర్తి…
Published Date :February 13, 2024 , 10:57 am డీజే టిల్లు సినిమాతో యూత్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఈ సినిమా ఒక డ్రగ్ లా ఆడియన్స్ ని ఎక్కేసింది. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగ వాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. మార్చ్ 29న టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ముందుకి రానుంది. నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
Sonia Gandhi: రాజ్యసభకు సోనియా పోటీ.. ఎక్కడ నుంచంటే..!
Published Date :February 12, 2024 , 7:35 pm కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభకు కాకుండా రాజ్యసభకు వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Ayodhya: రామమందిరంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పూజలు
Published Date :February 12, 2024 , 4:39 pm ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుటుంబం (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుటుంబం (Punjab CM Bhagwant Mann) ఆయోధ్యలో (Ayodhya) పర్యటించారు. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగిన రామమందిరాన్ని (Ram Temple) ముఖ్యమంత్రుల కుటుంబాలు సందర్శించి.. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు..
Bihar: బలపరీక్షలో నితీష్ విజయం
Published Date :February 12, 2024 , 4:03 pm బీహార్ అసెంబ్లీలో (Bihar Assembly) జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ (Nitish Kumar) సర్కార్ విజయం సాధించింది. అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్ట్‌లో సీఎం నితీశ్ కుమార్‌కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన బలపరీక్షలో సునాయసంగా గట్టెక్కేశారు. మరోవైపు అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. అంతకముందు ఆర్జేడీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌లో ఉంచారు.
Ozone Hospitals: ఘనంగా ఓజోన్ హాస్పిటల్స్ 10వ వార్షికోత్సవ వేడుకలు..
Published Date :February 12, 2024 , 12:40 pm హైదరాబాద్ నగరంలోని కొత్తపేట, అల్వాల్ ప్రాంతాలలో ప్రముఖ ఓజోన్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ నెలకొల్పి ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారు. 10-02-2024, శనివారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి నాగోల్ లోని పీబీఆర్ కన్వెన్షన్ లో తమ హాస్పిటల్స్ 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Eagle: ఈరోజు నిలబడితే ఈగల్ ని ఆపడం కష్టమే…
Published Date :February 12, 2024 , 11:56 am మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ని తెరకెక్కించిన కార్తీక్ ఘట్టమనేని… రవితేజని సూపర్ గా ప్రెజెంట్ చేసాడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈగల్ సినిమా వాయిదా పడి ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చింది. సంక్రాంతి సీజన్ లో ఈగల్ సినిమా రిలీజై ఉంటే ఖచ్చితంగా ఎదో ఒక సినిమాకి భయంకరమైన లాస్ జరిగేది. పండగ సీజన్ లో పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
Rebel MLAs Disqualification: రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా..?
Published Date :February 12, 2024 , 8:28 am Rebel MLAs Disqualification: ఆంధ్రప్రదేశ్‌లో రెబల్ ఎమ్మెల్యే ఎపిసోడ్లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించనున్నారు.. ఈ రోజు ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు.
Thalapathy Vijay: ఆ సినిమా రీరిలీజ్ దెబ్బకి సోషల్ మీడియా హైజాక్…
Published Date :February 11, 2024 , 1:35 pm సోషల్ మీడియాని హైజాక్ చేసి దళపతి విజయ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గిల్లీ’ రీరిలీజ్ అవుతుంది అనే వార్త బయటకి వచ్చింది. రీరిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ రాలేదు కానీ రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియగానే సోషల్ మీడియాలో గిల్లీ, విజయ్, దళపతి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తూ మంచి జోష్ లో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాకి రీమేక్ గా గిల్లీ తెరకెక్కింది.
Raviteja: బచ్చన్ సెట్స్ లో ఈగల్ సెలబ్రేషన్స్…
Raviteja: బచ్చన్ సెట్స్ లో ఈగల్ సెలబ్రేషన్స్… Published Date :February 11, 2024 , 1:23 pm మాస్ మహారాజ రవితేజ ఈగల్ సినిమాతో ఫిబ్రవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో… రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. గూస్ బంప్స్ ఎపిసోడ్స్ అండ్ యాక్షన్స్ బ్లాక్స్ ఉండడంతో… ఈగల్ సినిమా మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన రవితేజ… ఈగల్ సినిమాతో కంబ్యాక్ హిట్ కొట్టాడు. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి.
Pushpa 3: రైజ్… రూల్ కాదు… ఇకపై “రోర్”
Published Date :February 11, 2024 , 1:12 pm అల్లు అర్జున్, సుకుమార్ నుంచి ఇంకా అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం పుష్ప పార్ట్ 3 టైటిల్ వైరల్‌గా మారింది. పార్ట్ వన్ పుష్ప… ది రైజ్ పేరుతో రిలీజ్ అవగా, పార్ట్ 2 పుష్ప… ది రూల్ పేరుతో రాబోతోంది. ఇక్కడితో పుష్పగాడి రూల్కి ఎండ్ కార్డ్ పడుతుందని అనుకున్నారు కానీ చాలా రోజులుగా పుష్ప3 కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ… పుష్ప3 రావడం పక్కా అనే లేటెస్ట్ బజ్ వైరల్‌గా మారింది.
Top Headlines@9PM: టాప్ న్యూస్
Published Date :February 10, 2024 , 8:59 pm *133 మంది తహశీల్దార్ల బదిలీ.. తెలంగాణలో 133 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. అంతేకాకుండా.. 32 మంది ఆర్డీవోలు కూడా బదిలీ అయ్యారు. వారితో పాటు.. డిప్యూటీ కలెక్టర్లు, నయాబ్ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధికారులు బదిలీలు జరిగాయి. కాగా.. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
TS News: 133 మంది తహశీల్దార్ల బదిలీ..
Published Date :February 10, 2024 , 7:31 pm తెలంగాణలో 133 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. అంతేకాకుండా.. 32 మంది ఆర్డీవోలు కూడా బదిలీ అయ్యారు. వారితో పాటు.. డిప్యూటీ కలెక్టర్లు, నయాబ్ తహశీల్దార్లు బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అధికారులు బదిలీలు జరిగాయి. కాగా.. వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.
Top Headlines@5PM: టాప్ న్యూస్
Published Date :February 10, 2024 , 5:00 pm *జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు.. ఆరోగ్య శ్రీకి ప్రత్యేక కార్డు ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు.. వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే.. నేషనల్ హైవేలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వమని పేర్కొ్న్నారు. పెట్టుబడి సాయం అందాల్సింది రైతులకు అని తెలిపారు.
True Lover Movie Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ!
Published Date :February 10, 2024 , 9:22 am MAIN CAST: Manikandan.K, Gouri Priya Reddy, Kanna Ravi DIRECTOR: Prabhu Ram Vyas MUSIC: Sean Roldan PRODUCER: Nazerath Pasilian, Magesh Raj Pasilian True Lover Movie Review: మణికందన్, గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా ప్రభూరామ్ వ్యాస్ దర్శకత్వంలో తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది. అదే సినిమాని తెలుగులో ట్రూ లవర్ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కె.ఎన్.
Pakistan Elections: “నేనే గెలిచాను”.. నవాజ్ షరీఫ్ ప్రకటన..
Published Date :February 9, 2024 , 8:43 pm Pakistan Elections: దక్షిణాసియాలో చర్చనీయాంశంగా పాకిస్తాన్ ఎన్నికలు మారాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఇలా పలు సంక్షోభాల్లో చిక్కుకున్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. గురువారం ఆ దేశంలో పోలింగ్ జరగ్గా, నిన్న సాయంత్రం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. 24 గంటలు దాటిని ఇంకా దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఏ పార్టీ గెలుచిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Viral Video : ఈ అందమైన జీవిని ఎప్పుడైన చూశారా?
Published Date :February 9, 2024 , 8:04 pm ఈ ప్రకృతిలో చాలా అందమైన జంతువులు ఉన్నాయి.. ఎన్నో వింతలను తనలో దాచుకుంది.. అందుకే చాలా మంది ప్రకృతిని ప్రేమిస్తారు.. ఇప్పుడు మనం ఓ అందమైన జీవి గురించి తెలుసుకుందాం.. లీఫ్ షీప్ స్లగ్ అని పిలువబడే మనోహరమైన సముద్ర జీవులు వాటి మెత్తటి రూపాన్ని మరియు చమత్కారమైన చేష్టలతో ఇంటర్నెట్ను తుఫానుగా మారుస్తున్నాయి.
Election Commission: దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు..
Published Date :February 9, 2024 , 5:36 pm Election Commission: మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 18-29 ఏళ్ల మధ్య గల యంగ్ ఓటర్లు 2 కోట్ల మంది కొత్తగా ఓటర్ లిస్టులో చేరినట్లు వెల్లడించింది. Read Also: PM Modi: షాక్‌లో ఎంపీలు..
Kottu Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్.. ఆయన మొహం వాడిపోయింది..!
Published Date :February 9, 2024 , 4:45 pm Kottu Satyanarayana: చంద్రబాబు ఢిల్లీ పర్యటన అట్టర్ ప్లాప్ అని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. తన అవసరం బీజేపీకి ఉన్నట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు.. బీజేపీ పెద్దలు బతిమాలి బాబాను పిలిచినట్టు చెప్పుకొచ్చారు.. కానీ, బీజేపీని శాసించే పరిస్థితిలో చంద్రబాబు లేరని వ్యాఖ్యానించారు. ఇక, ఢిల్లీ వెళ్లి వచ్చాక చంద్రబాబు మొహం వాడిపోయిందన్నారు.. పవన్ కల్యాణ్ దిగజారిపోయారు అంటే కోపం తెచ్చుకునే జనసైకులు ఇప్పుడు ఏమంటారో వారి విజ్ఞతకే వదిలేయాలన్నారు.
Viral Video : అరె ఏంట్రా.. నీ డ్రైవింగ్ కు దండం రా..
Published Date :February 9, 2024 , 3:48 pm ఈ మధ్య చాలా బాగా డ్రైవింగ్ చేసే వాళ్లు కూడా ఏదొక సందర్భంలో ఎక్కడో చోట పొరపాటు చేస్తుంటారు.. సాధారణంగా వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆదమరిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. ఈ విషయం అందరికీ తెలుసు.. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.. ప్రస్థుతం సోషల్ మీడియాలో ఒక కారు డ్రైవింగ్ వీడియో హల్చల్ చేస్తుంది. అయితే ఆ డైవర్ ఏం జాగ్రత్తలు పాటించాడో తెలియదు గానీ కారు డ్రైవ్ చేసేప్పుడు మాత్రం మెదడు.. మోకాళ్లో పెట్టినట్టుగా ఉన్నాడు.
Peddireddy Ramachandra Reddy : చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు
Published Date :February 9, 2024 , 11:08 am చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో కి వచ్చినప్పుడు 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25 వేల కోట్లకు చేరిందని, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని ఆయన అన్నారు.
Bandi Sanjay :ఎల్లుండి నుండి బండి సంజయ్ యాత్ర
Published Date :February 8, 2024 , 9:38 pm బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎల్లుండి ( ఈనెల 10) నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో “ప్రజాహిత పాదయాత్ర” చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధమైంది.
Stray Dogs Attack: మహిళపై 20 కుక్కల దాడి.. శరీరాన్ని ముక్కలుగా చేసి..
Published Date :February 7, 2024 , 5:25 pm Stray Dogs Attack: పంజాబ్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల మహిళపై దాదాపుగా 20 వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కపుర్తలా జిల్లాలోని పస్సాన్ కడిమ్ గ్రామంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక సుల్తాన్ పూర్ లోధిలో మహిళ పశువుల్ని మేపేందుకు పొలాల్లోకి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. Read Also: Banana Exports: భారత అరటిపండ్లకు ఫుల్ డిమాండ్.. రష్యాకు ఎగుమతి.. సాయంత్రం భార్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త వెతకడం ప్రారంభించాడు.
Top Headlines@1PM: టాప్ న్యూస్
Published Date :February 7, 2024 , 1:00 pm *ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,86, 389 కోట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. మహాత్మగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోను సీఎం జగన్ ప్రవిత్ర గ్రంథంగా భావించారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నామని తెలిపారు. బుగ్గన, ఆర్థిక మంత్రి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.
Top Headlines@9AM: టాప్ న్యూస్
Published Date :February 7, 2024 , 9:00 am *నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. సభలో ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు ప్రభుత్వం పెట్టనుంది. ఏపీలో మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
AP Budget LIVE UPDATES: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. లైవ్ అప్డేట్స్
07 Feb 2024 08:16 AM (IST) కాసేపట్లో కేబినెట్ భేటీ.. సచివాలయం చేరుకున్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన కాసేపట్లో కేబినేట్ భేటీ జరగనుంది. బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించనుంది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయం చేరుకున్నారు. తన ఛాంబర్ లో బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ చేశారు. అనంతరం నేరుగా క్యాబినెట్ భేటీకి బుగ్గన వెళ్లారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతులతో క్యాబినెట్ సమావేశానికి బుగ్గన చేరుకున్నారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Published Date :February 7, 2024 , 7:21 am *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశం.. ఉదయం 8 గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో సమావేశం.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్. *అమరావతి: ఇవాళ మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ.. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం..
U19 World Cup 2024: ఫైనల్లోకి అడుగుపెట్టిన టీమిండియా..
Published Date :February 6, 2024 , 9:47 pm అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో.. ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఈనెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ జరిగితే, ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్లో ప్రత్యర్థి జట్టును పాకిస్తాన్ ను ఓడించినా.. ఆస్ట్రేలియాను ఓడించినా భారత్ రివేంజ్ తీసుకున్నట్లు అవుతుంది.
Delhi: అద్వానీతో బీజేపీ అగ్రనేతల భేటీ
Published Date :February 6, 2024 , 6:14 pm బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని (Lal Krishna Advani) బీజేపీ అగ్రనేతలు కలిశారు. ఇటీవల అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అద్వానీకి అభినందనలు తెలిపారు. మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda).. అద్వానీ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
Hanuman: 300 కోట్లు నాట్ అవుట్…
Published Date :February 6, 2024 , 1:30 pm సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 92 ఏళ్ళ తెలుగు సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ చరిత్రలో హనుమాన్ సృష్టించిన రికార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండర్ డాగ్ గా రిలీజైన హనుమాన్ సినిమా స్టార్ హీరోలతో పోటీలో విన్నర్ గా ఎమర్జ్ అయ్యింది. డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హనుమాన్ రిలీజై 25 రోజులు అయ్యింది. మొదటి వారంలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… మూడో రోజు నుంచి థియేటర్స్ కౌంట్ పెంచుకోని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది.
Top Headlines@1PM: టాప్ న్యూస్
Published Date :February 6, 2024 , 1:02 pm *సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
AP Assembly: సభ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Published Date :February 6, 2024 , 11:15 am AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
Venkatesh Netha Borlakunta: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్ లోకి ఎంపీ వెంకేటస్ నేత..
Published Date :February 6, 2024 , 10:41 am Venkatesh Netha Borlakunta: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్‌లో చేరారు. వివరాల ప్రకారం.. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ లో చేరారు.
Top Headlines@9AM: టాప్ న్యూస్
Published Date :February 6, 2024 , 8:56 am *గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. అసెంబ్లీ ముందుకు రెండు కీలక బిల్లులు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు..
Free WiFi: మేడారం జాతరలో ఉచిత వైఫై సేవలు.. 15 నుంచి 25 వరకు..
Published Date :February 6, 2024 , 8:24 am Free WiFi: మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు దేశ, విదేశాల నుంచి సుమారు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగే ఈ జాతరలో కమ్యూనికేషన్ సేవలు ఎంతో కీలకం కానున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ నుండి ఇంటర్నెట్, వై-ఫై సేవలు చాలా ముఖ్యమైనవి. సరైన సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడంతో అక్కడికి వెళ్లే భక్తులకు తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Published Date :February 6, 2024 , 7:25 am *అమరావతి: ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.. ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం.. సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు- 2024, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు -2024.
Top Headlines@1PM: టాప్ న్యూస్
Published Date :February 5, 2024 , 12:56 pm *ఫిబ్రవరి 8 వరకు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో నిర్ణయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశమైంది. ఈ బీఏసీ సమావేశంలో నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశమైంది.
VellamPalli Srinivas vs Bonda Uma: వెల్లంపల్లి వర్సెస్ బోండా ఉమా.. సీరియస్ కామెంట్స్..!
Published Date :February 5, 2024 , 8:13 pm VellamPalli Srinivas vs Bonda Uma: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నేత బోండా ఉమా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వెల్లంపల్లిపై విరుచుకుపడ్డా బొండా ఉమా.. తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.. వ్యక్తిగత దూషణలకు దిగారు.. అమ్మవారి చీరలు, వెండి సింహాలు కొట్టేసినందుకు మంత్రి పదవి నుంచి పీకేశారని.. నామీద మాట్లాడటం అంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే.. ప్రతీ యాక్షన్ కీ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. వెల్లంపల్లి మాట్లాడుతున్న తీరుపై ఇవాళ సీపీకి ఫిర్యాదు ఇచ్చా..
Minister Jogi Ramesh: వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!
Published Date :February 5, 2024 , 7:19 pm Minister Jogi Ramesh: మైలవరం రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించింది. దీంతో, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత.. వైసీపీని వీడడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఇదే సమయంలో, వైసీపీ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.. ఇక, వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు..
Show More
loading
Actions
Is this you?
As a journalist, you can create a free Muck Rack account to customize your profile, list your contact preferences, and upload a portfolio of your best work.Get in touch with NTV
Contact NTV, search articles and posts on X, monitor coverage, and track replies from one place.
Learn more about Muck Rack