'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన విడుదలైన తమిళ సినిమానే 'పూకీ'. తెలుగులో ఈ సినిమాను 'బూకీ' పేరుతో విడుదల చేశారు. విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో, నాయికగా ధనూషా అలరించింది. గణేశ్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ ఆంటోని తన సొంత బ్యానర్ పై నిర్మించడమే కాకుండా, సంగీతాన్ని సమకూర్చాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 13వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. వైజాగ్ కి చెందిన మిడిల్ క్లాస్ యువకుడు కైలాశ్ (అజయ్ దిశాన్). అతను ..