ప్రేమ' అనే రెండు అక్షరాలకు సరైన నిదర్శనాలు చూపించలేము .. నిర్వచనాలు చెప్పలేము. విడిపోతే బ్రతకలేనిది ప్రేమనో .. బ్రతుకున్నత వరకూ విడిపోలేనిది ప్రేమనో తేల్చి చెప్పడం చాలా కష్టం. పున్నమి వెన్నెల .. సముద్రం మాదిరిగా ప్రేమ కూడా ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది .. కొత్త అనుభూతులనే పంచుతుంది. అలాంటి ఒక ప్రేమకథనే 'సిరై'. క్రితం ఏడాది డిసెంబర్ 25న థియేటర్లకు వచ్చిన ఈ తమిళ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీను (విక్రమ్ ప్రభు) ఓ పోలీస్ కానిస్టేబుల్.