Thudakkam Review మోహన్ లాల్ కూతురు 'విస్మయ' ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'తుడక్కమ్'. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ డ్రామా ఇది. జుడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నిర్మాత ఆంటోని పెరంబవూర్ తనయుడు 'ఆశిష్ జో ఆంటోని' ఒక కీలకమైన పాత్రను పోషించాడు. గెస్టు రోల్ లో మోహన్ లాల్ మెరిసిన ఈ సినిమా, ఆగస్టు 7వ తేదీన విడుదలై 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు ( సెప్టెంబర్ 18) నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియోలోను అందుబాటులో ఉంది.