Hi Review బుల్లి తెరపై నుంచి వెండితెర వరకూ ఎదిగిన నటులలో కెవిన్ రాజ్ ఒకరుగా కనిపిస్తాడు. కథానాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కెవిన్, నయనతారతో కలిసి నటించిన సినిమానే 'హాయ్'. విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 28వ తేదీన విడుదలైంది. రాధిక . ప్రభు .. భాగ్యరాజ్ .. సుహాసిని కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ రోజు (సెప్టెంబర్ 25) నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్రమణ్యం (కెవిన్) ఒక రకంగా కలవారి కుటుంబానికి చెందిన అబ్బాయే.