Andhra Pradesh ఏపీలో ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా పార్టీలో, ప్రభుత్వంలో ఓ రేంజ్ లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. పార్టీ అధికారం కోల్పోయాక క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆ తర్వాత యూటర్న్ తీసుకుని రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అంతే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యువతకు కూడా ఆయన ఇప్పుడు సలహాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో యువతకు భవిష్యత్ ఉద్యోగాలకు సంబంధించి సాయిరెడ్డి ఓ సూచన చేశారు.