OnePlus Ace 6 Ultra: వన్ ప్లస్ తన ఏస్ (Ace) సిరీస్‌లో మరో పవర్ఫుల్ మోడల్‌ను చేర్చబోతోంది. అదే 'వన్ ప్లస్ ఏస్ 6 ఆల్ట్రా'. సాధారణంగా ఏస్ సిరీస్ చైనాలో లాంచ్ అయి, మన దగ్గర వేరే పేర్లతో విడుదలవుతుంటాయి. ఈ ఆల్ట్రా మోడల్ మాత్రం ప్యూర్ గేమింగ్ ఫోన్‌గా రాబోతోంది. రెడ్మీ కె90 ఆల్ట్రా వంటి ఫోన్లకు ఇది డైరెక్ట్ పోటీనివ్వబోతోంది. దీని స్పెసిఫికేషన్లు చూస్తుంటే టెక్ ప్రపంచం షాక్ అవ్వడం ఖాయం. ఈ ఫోన్లో 6.8 అంగుళాల భారీ స్క్రీన్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే 165Hz హై-రిఫ్రెష్ రేట్.